పారా క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:04 AM
పారా క్రీడాకారులు (దివ్యాంగులు)కు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.
పోలాకి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): పారా క్రీడాకారులు (దివ్యాంగులు)కు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం కత్తెరవానిపేట క్యాంపు కార్యాలయంలో ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఓ నంబర్ 4 ద్వారా 3 శాతం ప్రభుత్వ ఉద్యోగాలకు రాతపరీక్ష లేకుండా నేరుగా పారా క్రీడల్లో పాల్గొన్న దివ్యాంగులకు అవకాశం కల్పించడం శుభపరిణామమన్నారు. పారా క్రీడాకారుల జాతరను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వి.రామస్వామి, కె.దయానంద్, షీతల్ మదన్, సురేష్, రమణమూర్తి, అచ్యుతరావు, రవికుమార్, శివగంగ తదితరులు పాల్గొన్నారు.