Share News

విశాఖకు గూగుల్‌ రాక ప్రతిష్టాత్మకం

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:30 PM

విశాఖపట్నానికి గూగుల్‌ రాక ఎంతో ప్రతిష్టాత్మకమని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

విశాఖకు గూగుల్‌ రాక ప్రతిష్టాత్మకం
మాట్లాడుతున్న ఎంపీ క లిశెట్టి అప్పలనాయుడు

అరసవల్లి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి గూగుల్‌ రాక ఎంతో ప్రతిష్టాత్మకమని విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. స్థానిక 80 అడుగుల రోడ్డులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్త రాంధ్ర అభివృద్ధికి సీఎం చంద్ర బాబు అహర్నిశలు కృషి చేస్తుంటే, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి బెంగళూరు ప్యాలెస్‌ నుంచి గూగుల్‌పై కుట్రకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. గూగుల్‌ అడ్డుకోవాలని చూస్తున్నారని అది జరగదన్నారు. వచ్చే నెలలో పారిశ్రామిక సదస్సు జరుగనుందని మరిన్ని కంపెనీలు ఉత్తరాంధ్రకు రానున్నాయ న్నారు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు త్వరలో ప్రారంభం కానుందని, ఉత్తరాంధ్ర అభి వృద్ధి ఖాయమని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:30 PM