సృజనాత్మక బోధనతో సత్ఫలితాలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:57 PM
సృజనాత్మక బోధనతో సత్ఫలితాలు సాధించ వచ్చని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు.
గురుకులాల జిల్లా సమన్వయాధికారి యశోదలక్ష్మి
పాత శ్రీకాకుళం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సృజనాత్మక బోధనతో సత్ఫలితాలు సాధించ వచ్చని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు. నగర పరిధిలోని పెద్దపాడు డా.బీఆర్ అంబే డ్కర్ గురుకులంలో గురువారం ఉపాధ్యాయులు, అధ్యాప కులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షల్లో శతశాతం ఫలితాలు పొందేలా అవస రమైన మెటీరియల్ తయారు చేయాలన్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్ ఐ.సంతోష్ కుమార్ హిందీ ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు. డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ కె.తారకరామారావు స్ట్రెస్ మేనేజ్మెంట్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గురుకులాల ప్రిన్సిపాళ్లు ఎస్. పద్మజ, ఎన్.రామకృష్ణ, బుచ్చిరాజు, పేడాడ శ్రీనివాస్ భాషా అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.