Share News

చంద్రన్నతోనే సుపరిపాలన: ఎమ్మెల్యే రవికుమార్‌

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:35 PM

రాష్ట్రంలో సీఎం చంద్రబాబుతోనే సుపరి పాలన సాధ్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

  చంద్రన్నతోనే సుపరిపాలన: ఎమ్మెల్యే రవికుమార్‌
ఆమదాలవలస: పీర్‌సాహెబ్‌పేటలో ప్రచారం చేస్తున్న పాల్గొన్న రవికుమార్‌

ఆమదాలవలస, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం చంద్రబాబుతోనే సుపరి పాలన సాధ్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. ఆదివారం కలివరం గ్రామ పంచాయతీ పీర్‌సాహెబ్‌పేట గ్రామంలో ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం ప్రతి పథకం ద్వారా లబ్ధిచేకూర్చడం జరుగుతుందన్నారు. ఇంటిం టికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి పథకాలను వివరించారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మెట్ట సుజాత, పార్టీ మండల అధ్యక్షుడు నూకరాజు, నారాయణపురం ఆనకట్ట చైర్మన్‌ సనపల ఢిల్లీశ్వరరావు, నాయకులు తమ్మినేని నాని, అన్నెపు భాస్కర రావు, గొండు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్‌

గార, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఆదివారం రామచంద్రాపురం, సతివాడ గ్రామాల్లో ‘సుపరి పాలనకు తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఎన్నికల ముందు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:35 PM