చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యం
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:11 AM
రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన నాటి నుంచి నిరంతరం అలుపెరుగని పోరాటంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు.
ఎల్‌ఎన్ పేట, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతులు చేపట్టిన నాటి నుంచి నిరంతరం అలుపెరుగని పోరాటంతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి 30ఏళ్ల పూర్తయిందని, అప్పటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. పార్టీ నాయకులు ఎం.మనోహర్, కె.చిరంజీవి, వి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
సంస్కరణలకు కేరాఫ్‌గా..
నరసన్నపేట, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): సంస్కరణలకు కేరాఫ్ అడ్రాస్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం లో అనేక సంస్కరణలకు బీజం వేసి అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.
సంక్షేమమే ధ్యేయంగా..
కొత్తూరు, సె ప్టెంబరు 1(ఆంధ్ర జ్యోతి): సంక్షేమమే ధ్యేయంగా ముఖ్య మంత్రి చంద్రబా బు తన పాలన కొనసాగించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. సోమవారం కొత్తూరలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, ఈ క్రమంలో తన పాలనతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. 70 ఏళ్ల వయస్సులో దాదాపు 47 ఏళ్లు రాజకీయాల్లో ఉంటూ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. టీడీపీ నాయకులు ఎల్.భగవాన్‌దాస్ నాయడు, మడపాన రజారావు, గండివలస తేజేశ్వరావు, వాసు తదితరులు పాల్గొన్నారు.