కూటమితోనే సుపరిపాలన సాధ్యం
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:56 PM
రాష్ట్రంలో సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యేలు అన్నారు. బుధవారం వివిధ గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలిచ్చి పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు.
రాష్ట్రంలో సుపరిపాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యేలు అన్నారు. బుధవారం వివిధ గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలిచ్చి పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు.
రాష్ట్రంలో అభివృద్ధి శకం: ఎమ్మెల్యే శంకర్
శ్రీకాకుళం రూరల్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం ఆధ్వర్యంలో అభివృద్ధి శకం ప్రారంభమైందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని బుధవారం శిలగాం సింగువలస గ్రామంలో నిర్వహించారు. స్థానిక పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంచు దశరఽథుడు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. అలాగే గ్రామానికి చెందిన ధర్మాన పద్మకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ రూ.40 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
హామీలను అమలు చేస్తున్నాం
మెళియాపుట్టి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని కూటమి ప్రభు త్వం అమలు చేస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు. బుధవారం గొప్పిలి గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సలాన మోహనరావు, నంబాల వెంకటరావు, బి.దినకరావు, అనపాన రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
హరిపురం, జూలై 30(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ మేరకు బుధవారం మందస మండలం బెల్లుపటియా గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధన ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లా డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రట్టి లింగరాజు, పీరుకట్ల విఠల్, తమిరి భాస్కరరావు, దాసరి తాతారావు తదితరులుపాల్గొన్నారు.
ప్రజల మెప్పు పొందిన పాలన
కొత్తూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): ప్రజల మెప్పును పొందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. బుధవారం మెట్టూరు గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు బర్రి గోవిందరావు, కొప్పల రామకృష్ణ, యోగి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.