Good Friday : భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:05 AM
Good Friday : జిల్లావ్యాప్తంగా శుక్రవారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఉదయాన్నే చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
శ్రీకాకుళంకల్చరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శుక్రవారం క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఉదయాన్నే చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాదర్లు బైబిల్‌ను చదివి క్రీస్తు సందేశాన్ని వినిపించారు. ఏసు మార్గమే.. మానవాళికి జీవనమార్గం కావాలని సూచించారు. అందరూ సుఖసంతోషాలు, శాంతి కోసమే ఏసు ప్రాణత్యాగం చేశారన్నారు. శ్రీకాకుళం నగరంలోని చిన్నబజార్ తెలుగు బాప్టిస్ట్, టౌన్‌హాల్, ఆర్‌సీఎం లయోలా, ఉమెన్స్ కాలేజీ రోడ్‌లోని ఆరాధన కేంద్రం, తదితర చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ భక్తులు.. శిలువ మార్గంలో ఏసుక్రీస్తు పడిన శ్రమల పాట్లును వివిధ వేషధారణలతో కళ్లకు కట్టి నట్టు చూపించారు. శిలువను మోస్తూ ఏసు ప్రభువు, ఇతర వేషధారణలతో ఊరేగింపు నిర్వహించారు. ఏసు ప్రభువు మన కోసమే జన్మించారని, మనందరి కోసం ప్రాణత్యాగం చేశారని, ఆయన రక్తం మనలను శుద్ధి చేస్తుందని తెలిపారు.