Share News

స్వర్ణోత్సవ సమ్మేళనం

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:27 PM

చారిత్రక ప్రసిద్ధి కలిగిన శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారంతా 1972-75 బీఎస్సీ చదువుకున్నారు.

స్వర్ణోత్సవ సమ్మేళనం
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న 1972-75 డిగ్రీ విద్యార్థులు

పాత శ్రీకాకుళం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): చారిత్రక ప్రసిద్ధి కలిగిన శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారంతా 1972-75 బీఎస్సీ చదువుకున్నారు. ఇప్పటికి 50 ఏళ్లు పూర్తయింది.. వారంతా ఒక చోట కలిసి ఆనందంగా గడిపారు. శ్రీకాకుళం నగరం లోని పెద్దపాడు రోడ్డులో ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్లో ఆదివారం నాటి విద్యార్థులంతా స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాలేజీలో గడిపిన క్షణాలు నేమరువేసు కుంటూ, వృత్తులు, రిటైరైన వారి అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుని సంతోషంగా గడిపారు. ఇకపై ప్రతి ఏటా కుటుంబాల సమేతంగా కలుసుకోవాలని తీర్మానిం చారు. కార్యక్రమంలో సురంగి మోహనరావు, వై.మురళీ మోహన్‌రావు, సీపాన వెంకట రావు, నారా ఈశ్వరరావు, వి.ప్రభాకర్‌రావు, గేదెల మోహనరావు, టీవీ రాఘవరావు, రాజమోహన్‌ పట్నాయక్‌, వీవీ నరసింహారావు, రమణాచారి, యు.ప్రభాకర్‌, వి.అప్పారావు, బి. అప్పారావు, సవరయ్య తదితరులు పాల్గొన్నారు.

50 వసంతాల తర్వాత..

హరిపురం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మందస మండలం జీఆర్‌ పురం హైస్కూ ల్‌లో 1973-74 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్నవారంతా ఆదివారం హరిపురంలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో కలుసుకున్నారు. 50వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం రిటైర్డు హిందీ ఉపాధ్యాయులు ఆదినారాయణను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయ కులు ప్రదాన మన్మథరావు, సనపల కామేశ్వరరావు, తెలుగుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 11:27 PM