Roads: రహదారులకు మహర్దశ
ABN , Publish Date - May 08 , 2025 | 11:54 PM
Roads Infrastructure Development అధ్వానంగా ఉన్న రహదారులను బాగుచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేల చొరవతో రూ.27,25,84,000 నిధులతో 26 పంచాయతీరాజ్ రోడ్లకు మోక్షం లభించనుంది. పంచాయతీరాజ్ పరిధిలో మొత్తంగా 59.69 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మాణ ప్రక్రియ జరగనుంది.

జిల్లాలో రూ.27కోట్లతో 26 పీఆర్ రోడ్లు
టెక్కలి, మే 8(ఆంధ్రజ్యోతి): అధ్వానంగా ఉన్న రహదారులను బాగుచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేల చొరవతో రూ.27,25,84,000 నిధులతో 26 పంచాయతీరాజ్ రోడ్లకు మోక్షం లభించనుంది. పంచాయతీరాజ్ పరిధిలో మొత్తంగా 59.69 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మాణ ప్రక్రియ జరగనుంది. ఈ నిధుల్లో నాబార్డు వాటా రూ.17.33 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.9.67 కోట్లు కేటాయించనుంది. టెక్కలి నియోజకవర్గానికి ఆరు రోడ్లు, నరసన్నపేటకు నాలుగు రోడ్లు, ఇచ్ఛాపురం, ఆమదాలవలసకు చెరో మూడు రోడ్లు, శ్రీకాకుళం రెండు, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు చెరో రోడ్డు చొప్పున నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి ఆమదాలవలస మండలంలో సీఎస్పీ రోడ్డు వయా బొబ్బిలిపేట, వెదుళ్లవలస వరకు రూ.1.80 కోట్లతో 4.30కిలోమీటర్లు, పొందూరు మండలంలో తాడివలస నుంచి గండ్రేడు వరకు రూ.80లక్షలతో 1.80 కిలోమీటర్లు, సరుబుజ్జిలి మండలంలో మతలబుపేట నుంచి చిన్నమతలబుపేట వరకు రూ.60లక్షలతో 1.20 కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మించనున్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో ఎచ్చెర్ల మండలంలో తోటపాలెం నుంచి వయా కొత్తపేట, మలముద్ద వరకు రూ.2,99,99,000తో 5.20 కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మిస్తారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో కంచిలి మండలం ఆర్అండ్బీ రోడ్డు 11/6 నుంచి కొండపోలూరు వరకు రూ.86.85లక్షలతో 1.48 కిలోమీటర్లు, బూరగాం నుంచి సోంపేట వరకు 66.84లక్షలతో 1.92 కిలోమీటర్లు, సోంపేట మండలంలో జాతీయరహదారి నుంచి ఎగువూరు రూ.149.73లక్షలతో 2.96కిలోమీటర్లు బీటీ రోడ్లు నిర్మాణం చేయనున్నారు.
నరసన్నపేట నియోజకవర్గ పరిధిలో జలుమూరు, సారవకోట ఎన్హెచ్.326 నుంచి వయా లింగటపాడు టు ఎన్హెచ్356ఏ వరకు రూ.1.15 కోట్లతో 4.37 కిలోమీటర్లు, నరసన్నపేట మండలం పరిధిలో జాతీయరహదారి పాలసీమ వయా రెడ్డికపేట, బసివలస వరకు రూ.45లక్షలతో 2.83కిలోమీటర్లు రహదారి నిర్మిస్తారు. పోలాకి మండలం పరిధిలో కేసీ రోడ్డు నుంచి వయా చీడివలస, డీఎన్ రోడ్డు వరకు కోటి రూపాయలతో 2.90కిలోమీటర్లు, తలసముద్రం నుంచి డోల రెగ్యులేటర్ వరకు రూ.40లక్షలతో 2.4కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మించనున్నారు.
పలాస మండలంలో ఎన్హెచ్-5 నుంచి లీలావతి వరకు రూ.39.84లక్షలతో రెండు కిలోమీటర్లు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి కొండపల్లి రూ.49.76లక్షలతో మూడు కిలోమీటర్లు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి గురుదాసుపురం వరకు రూ.29.90లక్షలతో ఒక కిలోమీటరు, వజ్రపుకొత్తూరు మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి పెద్దబాడాం వరకు రూ.79.70లక్షలతో 3.80కిలోమీటర్లు, అమలపాడు నుంచి సైనూరు వరకు రూ.84.68లక్షలతో 4.52కిలోమీటర్లు, ఎన్పీ రోడ్డు నుంచి చిన్నమురహరిపురం వరకు రూ.29.87లక్షలతో 1.40 కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మిస్తారు.
పాతపట్నం నియోజకవర్గంలో సీపీ రోడ్డు నుంచి వయా చంగుడి టు మాకన్నపల్లి వరకు రూ.3కోట్లతో 6.85 కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో గార మండలంలో సీఎస్పీ రోడ్డు ఇప్పిలి వయా పొగాకువానిపేట వరకు రూ.2కోట్లతో 5.20 కిలోమీటర్లు, జడ్పీ రోడ్డు నుంచి వయా బలివాడ, చిన్నవాడాడ వరకు రూ.75లక్షలతో 1.91 కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మిస్తారు.
టెక్కలి నియోజకవర్గ పరిధిలో కోటబొమ్మాళి మండలంలో రూ.169.69లక్షలతో కురుడు-దంత టు చిన్నసాన 3కిలోమీటర్లు, జాతీయరహదారి నుంచి కన్నేవలస-నారాయణపురం రూ.57.78లక్షలతో 1.05 కిలోమీటర్లు రహదారి నిర్మిస్తారు. సంతబొమ్మాళి మండలంలో రూ.141.97లక్షలతో బోరుభద్ర నుంచి కొల్లిపాడు వరకు 2.45కిలోమీటర్లు, రూ.54.84లక్షలతో జాతీయరహదారి కోటబొమ్మాళి నుంచి కాపుగోదాయవలస(సంతబొమ్మాళి) ఒక కిలోమీటరు రహదారి, రూ.87.53లక్షలతో డీపీఎం రోడ్డు టు ఉద్దండపాలెం వరకు 1.35కిలోమీటర్లు రోడ్డు నిర్మిస్తారు. అలాగే రూ.101.87లక్షలతో డీపీఎన్ రోడ్డు నుంచి గంగరాం వరకు 1.70కిలోమీటర్లు మేర బీటీ రోడ్లు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.