Share News

Gold prices : బంగారం, వెండి.. ధగధగ

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:19 AM

Gold and silver prices increased బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచీ ధర పెరుగుతూనే ఉంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 22 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములపై సుమారు రూ.30వేలు పెరిగింది.

Gold prices : బంగారం, వెండి.. ధగధగ

  • ఈ ఏడాదిలోనే 10 గ్రాముల స్వర్ణంపై రూ.33 వేలు పెరిగిన వైనం

  • అదేబాటలో సిల్వర్‌ ధరలు

  • పెట్టుబడిపై మదుపరుల ఆసక్తి

  • ధర పెరిగినా తగ్గని కొనుగోళ్లు

  • నరసన్నపేటకు చెందిన ఓ దంపతులు వచ్చే నెలలో తమ కుమార్తె వివాహానికి సంబంధించి ఆభరణాలు కొనుగోలు చేయడానికి గురువారం బంగారం దుకాణానికి వెళ్లారు. అక్కడ తులం ధర రూ.లక్ష దాటేయడంతో అవాక్కయ్యారు. వారం రోజుల వ్యవధిలో రూ.వేలల్లో ధర పెరిగిపోయిందని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నామని వాపోయారు.

  • నరసన్నపేటకు చెందిన ఒక వ్యాపారి గతంలో ఇనుపకొట్టు నిర్వహించేవాడు. కొన్నాళ్ల కిందట దానిని మూసేసి.. బంగారంపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి.. ధర కొంచెం పెరిగినా విక్రయించేవాడు. ఈక్రమంలో నెలకు 200 గ్రాముల బంగారం బిస్కెట్లపై రూ.లక్షన్నర వరకూ ఆదాయం పొందుతున్నాడు. ఆ వ్యాపారి బాటలోనే ఎంతోమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా బంగారం బిస్కెట్ల విక్రయాలు సాగిస్తున్నారు. దీంతో బంగారం ధర పెరిగినా డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు.

  • నరసన్నపేట, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచీ ధర పెరుగుతూనే ఉంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 22 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములపై సుమారు రూ.30వేలు పెరిగింది. 24 క్యారెట్లు బంగారం ధర రూ.32వేలకు పైగా పెరిగింది. గురువారం నాటికి నరసన్నపేట బులియన్‌ మార్కెట్‌లో బంగారం 22 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.లక్ష మార్కును దాటేసింది. ఇక 24 క్యారెట్లు బంగారం ధర రూ.1.10 లక్షలకు చేరింది. సామాన్యుడు చిన్న బంగారం వస్తువును కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర సుమారు రూ.40వేలకు పెరిగింది. ఈ ఏడాది ఆరంభంతో కిలో ధర రూ.88,500 ఉండగా, తరువాత ఒక్కసారిగా వెండి ధరలు తగ్గుముఖం పట్టినట్లు పట్టి.. పరుగులు తీసింది. జనవరి నుంచి ఇప్పటి వరకు కిలోకు రూ.40,500 వరకు పెరిగింది. దాదాపు 45శాతం వెండి ధరలు పెరిగాయి.

  • జిల్లాలో 500కు పైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. ఒక్క నరసన్నపేట పట్టణంలోనే దాదాపు వంద దుకాణాలు ఉన్నాయి. వీటిలో 12 దుకాణాల్లో హాల్‌సేల్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అనధికారకంగా పదుల సంఖ్యల దుకాణాల్లో బంగారం విక్రయిస్తున్నారు. బంగారం ధర పెరుగుతున్నా, రోజుకు కోట్లాది రూపాయల్లో లావాదేవీలు సాగుతున్నాయి. ఇందులో జీరో వ్యాపారం 70శాతం మేరకు సాగుతోంది. భవిష్యత్‌లో ధర మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకులు కూడా బంగారంపై ఎక్కువ మొత్తాల్లో రుణాలు ఇవ్వడంతో ఇంకొంతమంది పాత ఆభరణాలు తాకట్టు పెడుతున్నారు. కొత్త ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వివాహాలు, శుభకార్యాలతోపాటు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో కొనుగోళ్లు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

  • మదుపరుల ఆసక్తి

  • ధరలు పెరుగుతుండడంతో మదుపరులు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. మిగతా వ్యాపారాల కన్నా బంగారం రోజుకి 10 గ్రాములకు రూ.500 నుంచి రూ.1,250 వరకు పెరుగుతోంది. దీంతో 100 గ్రామల బంగారం బిస్కెట్‌ మీద పెట్టుబడి పెడితే.. రోజువారీ రూ.5వేల వరకు ఆదాయం వస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు, మదుపరులు బంగారం వ్యాపారాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రంప్‌ నిర్ణయాలతో వ్యాపార రంగాలపై అనిశ్చితి నేపఽథ్యంలో మదుపరులు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపడం ధర పెరుగుదలకు ఒక కారణం. అంతర్జాతీయ మార్కెట్‌ ఔన్స్‌ బంగారం ధర 500 డాలర్లు వరకు పెరగడం కూడా మరో కారణమని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

  • 10 గ్రాముల బంగారం ధర పెంపు ఇలా..(రూ.లో)

  • --------------------------------------

  • నెల 24క్యారెట్లు 22 క్యారెట్లు

  • -----------------------------------------

  • జనవరి 78,330 71,800

  • ఫిబ్రవరి 84,490 77,450

  • మార్చి 86,620 79,400

  • ఏప్రిల్‌ 97,910 89,750

  • మే 97,310 89,200

  • జూన్‌ 97,260 89,150

  • జూలై 1,00480 92,100

  • ఆగస్టు 1,0,3310 94,700

  • ప్రస్తుతం 1,10,510 1,0,1300

Updated Date - Sep 12 , 2025 | 12:19 AM