Share News

లిఫ్ట్‌ ఇచ్చి బంగారం దోపిడీ

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:06 AM

కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తకు సపర్యలు చేసి తిరిగి వెళ్తున్న ఓ వృద్ధురాలికి గుర్తు తెలియని ఆగంతకుడు తన బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చి రోడ్డు పక్కన తోటలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి బంగారం దొంగిలించిన ఘటన బుధ వారం జంట పట్టణాల్లో సంచలనం కలిగించింది.

లిఫ్ట్‌ ఇచ్చి బంగారం దోపిడీ
ఘటన గురించి స్థానికులకు చెబుతున్న బాధితురాలు యశోద

పలాస, మార్చి 12(ఆంధ్ర జ్యోతి): కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తకు సపర్యలు చేసి తిరిగి వెళ్తున్న ఓ వృద్ధురాలికి గుర్తు తెలియని ఆగంతకుడు తన బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చి రోడ్డు పక్కన తోటలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి బంగారం దొంగిలించిన ఘటన బుధ వారం జంట పట్టణాల్లో సంచలనం కలిగించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోసంగిపురం గ్రామానికి చెందిన దుంపల యశోద తన భర్త అప్పన్నకు కిడ్నీలు చెడిపోవడంతో కాశీబుగ్గలోని కిడ్నీ ఆసుపత్రిలో డయాలసిస్‌ చేస్తుం డడంతో ఆమె సపర్యలు చేసి చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయలు దేరింది. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి బస్సు కోసం వేచి ఉండగా బైక్‌పై ఓ గుర్తు తెలియని యువకుడు వచ్చి తన వాహనంపై ఎక్కమని చెప్పి మీ గ్రామం తీసుకు వెళతానని నమ్మబలికాడు. తొందరగా వెళ్లవచ్చని నమ్మి బైక్‌ ఎక్కింది. జీఎంఈ కాలనీ సమీపంలోకి రాగానే అక్కడున్న తోటల్లోకి ఆమెను ఆ ఆగంతకుడు తీసుకువెళ్లి కత్తితో బెదిరిం చాడు. ఆమె మెడలో ఉన్న రెండు తులాల మంగళ సూత్రం, అరతులం బంగారు శతమానం, బంగారు ఆభర ణాలు లాక్కుని క్షణాల్లో పరారయ్యాడు. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని అంచనా. అయితే ఈ హఠాత్ప రిణామంతో ఆమె బెంబే లెత్తి రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి వివరాలు తెలుసు కున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరిం చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.సూర్య నారాయణ తెలిపారు. ఇదిలా ఉండగా పట్టపగలు జాతీయ రహదారికి సమీపంలోనే ఇలా నిలువు దోపిడీ జరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, పిల్లలు బంగారం వేసుకొని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేని దుస్థితి నెలకొందని, ఇలాంటి బెదిరింపులు, దోపిడీలు వరుసగా జరుగుతుండడంపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకుని ఇటువంటి వాటిని నియంత్రించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:06 AM