Share News

వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:16 PM

బెంగుళూరులో గత మూడు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కొర్ని గ్రామానికి చెందిన చమళ్ల రాజశేఖర్‌ మూడు బంగారు పతకాలు సాధించాడు.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు
రాజశేఖర్‌కు బంగారు పతకాలు అందిస్తున్న అసోసియేషన్‌ కార్యదర్శి లక్ష్మి

గార, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): బెంగుళూరులో గత మూడు రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో కొర్ని గ్రామానికి చెందిన చమళ్ల రాజశేఖర్‌ మూడు బంగారు పతకాలు సాధించాడు. కర్ణాటక పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బెంగుళూరు ఎసేక్టో రిక్రియేషన్‌ హబ్‌ వైట్‌ఫీల్డ్‌లో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ 59 కిలోల సీనియర్స్‌ విభాగంలో రాజశేఖర్‌ మూడు బంగారు పతకాలు పొందాడు. ఆదివారం అసోసి యేషన్‌ కార్యదర్శి లక్ష్మి తదితర అతిథులు బహుమతి ప్రదానం చేశారు. జాతీయ పోటీల్లో బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందుకోవడం ఆనందంగా ఉందని రాజశేఖర్‌ తెలిపాడు. ఈ సందర్భంగా అతడిని గ్రామస్థులు అభినందించారు.

Updated Date - Oct 12 , 2025 | 11:16 PM