రెండుచోట్ల బంగారు పుస్తెల తాళ్లు చోరీ
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:12 AM
పాసిగంగుపేట, చంద్రయ్యపేట గ్రామాల్లో గురువారం రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో చోటుచేసు కొన్న చోరీలో బంగారు పుస్తెలు తాళ్లు దొంగతనానికి గురైనట్టు ఎస్‌ఐ కె.మధసూధనరావు తెలిపారు.
పాతపట్నం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): పాసిగంగుపేట, చంద్రయ్యపేట గ్రామాల్లో గురువారం రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో చోటుచేసు కొన్న చోరీలో బంగారు పుస్తెలు తాళ్లు దొంగతనానికి గురైనట్టు ఎస్‌ఐ కె.మధసూధనరావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఇళ్లల్లో నిద్రించి ఉండగ పాసిగంగుపేట గ్రామానికి చెందిన గంగు లక్ష్మి మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీచేశారు. అలాగే చంద్రయ్యపేట గ్రామంలో ఇంట్లో నిద్రించి ఉన్న మొర్రి పద్మావతి మెడలో నుంచి రెండుతులాల పుస్తెలతాడు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్టు ఎస్‌ఐ తెలిపారు. దసరా సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇస్తే.. ఆయా ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరైనా అనుమానాస్పందంగా తారాసపడితే సమాచారం ఇవ్వాలన్నారు.