Share News

బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ..

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:42 AM

సతివాడ గ్రామా నికి చెందిన మాజీ సర్పంచ్‌ గంగు ప్రభాకర రావు (48) రోడ్డు ప్రమా దంలో మృతిచెందారు. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ..

  • రోడ్డు ప్రమాదంలో సతివాడ మాజీ సర్పంచ్‌ మృతి

గార రూరల్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): సతివాడ గ్రామా నికి చెందిన మాజీ సర్పంచ్‌ గంగు ప్రభాకర రావు (48) రోడ్డు ప్రమా దంలో మృతిచెందారు. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గౌరీ పౌర్ణమి సందర్భంగా బుధవారం కొత్తవెలంపేట లో తమ బంధువుల ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో నిజామా బాద్‌ గ్రామ సమీపంలో తాను నడుపు తున్న ద్విచక్ర వాహనం అదపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే స్థానికులు గమనించి వచ్చి చూసేసరికే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అతని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమా చారం అం దించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ గంగరాజు తెలిపారు.

Updated Date - Oct 09 , 2025 | 12:42 AM