Share News

అమ్మవారి పండుగలకు వెళ్లి తిరిగి వస్తూ..

ABN , Publish Date - May 21 , 2025 | 12:06 AM

శ్రీకాకుళంలో జరుగుతు న్న అమ్మవారి పండుగలకు వెళ్లి తిరిగి వస్తూ ఆర్మీ జవాన్‌ మృత్యువాత పడిన ఘటన సత్యవరం ఫ్లై ఓవర్‌పై మంగళవారం సంభవించింది.

అమ్మవారి పండుగలకు వెళ్లి తిరిగి వస్తూ..

నరసన్నపేట/నందిగాం, మే 20(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో జరుగుతు న్న అమ్మవారి పండుగలకు వెళ్లి తిరిగి వస్తూ ఆర్మీ జవాన్‌ మృత్యువాత పడిన ఘటన సత్యవరం ఫ్లై ఓవర్‌పై మంగళవారం సంభవించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందిగాం మండలం పెంటూరుకు చెందిన అసోం రైఫిల్‌ ఫోర్స్‌లో జవాన్‌గా పనిచేస్తున్న పిన్నింటి దొరబాబు శ్రీకాకుళంలో జరుగుతున్న అసిరితల్లి పండుగలకు బంధువుల ఇంటికి తన మామయ్య నందిగాంకు చెందిన సనపల సీతారామయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి స్వగ్రామం వస్తూ సత్యవరం ఫ్లై ఓవర్‌కు వచ్చే సరికి బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరబాబు తలకు బలమైన గాయా లై అక్కడికక్కడే మృతి చెందగా, మామ సీతారాంకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో క్షతగాత్రుడిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటన ప్రాంతానికి ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ వెళ్లి పరిశీలించారు. మృతుడు దొరబాబు తన అన్న కుమార్తె వివాహం కోసం వారం కిందట సెలవుపై ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యం లో బంధువులు ఇంటికి పండుగలకు వెళ్లి తిరిగి వస్తూ దుర్మరణం చెంద డంతో కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. భార్య కాంచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. ఆర్మీ జవాన్‌గా సుమారు 15 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - May 21 , 2025 | 12:06 AM