పిడుగుపాటుకు మేకలు, గొర్రెలు మృతి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:57 PM
మండలంలోని డోలగోవిందపురం గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం పిడుగు పడిన ఘటనలో రెండు గొర్రెలు, రెండు మేకలు మృతి చెందాయి.
కంచిలి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని డోలగోవిందపురం గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం పిడుగు పడిన ఘటనలో రెండు గొర్రెలు, రెండు మేకలు మృతి చెందాయి. ఈ మేరకు పశు వైద్యాధికారి శిరీష, బాధిత రైతు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెల్లుపడ గ్రామానికి చెందిన గుర్రు రామారావు ఎప్పటిలాగానే ఆదివారం గొర్రెలు, మేకలను మేత కోసం డోలగోవిందపురం గ్రామం వైపు వెళ్లాడు. సాయంత్రం చిన్నపాటి వర్షం కురుస్తున్న సమయంలో పెద్ద శబ్దంతో గొర్రెలు, మేకలు వేస్తున్న సమీపంలో పిడుగు పడింది. దీంతో రెండేసి చొప్పున్న మేకలు, గొర్రెలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న పశు వైద్యాధికారి శిరీష ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.