గురుపూజోత్సవానికి వెళ్లి..
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:39 AM
తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ ఒక్కసారి కుప్పకూలి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నగరంలో గురువారం చోటుచేసుకుంది.
అస్వస్థతకు గురై విద్యార్థి మృతి
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ ఒక్కసారి కుప్పకూలి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నగరంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని కృష్ణాపార్క్ వద్ద నివాసం ఉంటున్న నిమ్మ ప్రదీప్‌రెడ్డి(18) నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం గురుపూజోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా తయారై కళాశాలకు వెళ్లాడు. కళాశాల లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. వెంటనే ఈ విషయాన్ని తోటి విద్యార్థులు యాజమాన్యానికి, అధ్యాపకులకు తెలిపారు. వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఇదిలావుంటే ప్రదీప్ ఫిట్స్ వ్యాధితో బాధప డుతున్నాడు. బెంగళూ రు తరచూ వెళ్లి చికిత్స తీసుకుంటున్నాడు. ప్రదీప్‌రెడ్డి తల్లి దండ్రులు కృష్ణా పార్క్ వద్ద తినుబండారాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోటబొమ్మాళి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి చిన్నబమ్మిడి జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గార మండలం, శ్రీకూర్మం గ్రామానికి చెందిన జగ లింగు శ్రీనివాస్(39) మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాస్ మానసిక వికలాంగుడని, గత కొన్నేళ్లుగా ని మ్మాడ, నిమ్మాడ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. ఈ క్రమంలో గురువారం చిన్నబమ్మిడి జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చిన్నతనంలో తండ్రి అప్పన్న నిమ్మాడ వసతి గృహంలో వంటివాడిగా పనిచేసేవాడు. అప్పట్లో నిమ్మాడలోనే కుటుంబ సభ్యులతో కలిసి అద్దెఇంట్లో ఉండేవారు. అప్పన్నకు బదిలీ కావడంతో శ్రీనివాస్ కూడా కుటుంబంతో కలిసి వెళ్లిపోయాడు. అయితే కొన్నేళ్లు కిందట శ్రీనివాస్ నిమ్మాడకు వచ్చి ఈ పరిసరాల్లో తిరుతున్నాడు. లారీ డ్రైవర్ ఢీకొట్టి పరారుకావ డంతో స్థానికులు సమాచారం మేరకు లారీని గుర్తించినట్టు, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ..
ఎచ్చెర్ల, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): సంతశీతారాంపురం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ప్రమాదంలో రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన బస్వా పార్వతి(49) తీవ్రంగా గాయ పడి శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చర్మవ్యాధితో బాధపడుతున్న పార్వతి తన కుమారుడు రామిరెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంతో కుప్పిలి, సంతశీతారాంపురం మీదుగా శ్రీకాకుళం నగరంలోని ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ వెనుక భాగంలో కూర్చొన్న పార్వతికి ఒక్కసారిగా కళ్లు తిరగడంతో రామి రెడ్డిని గట్టిగా పట్టుకోవడంతో బైక్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను 108లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వల్పగాయాలతో బయటపడిన రామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ-2 అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొట్లాటలో గాయపడిన వృద్ధురాలు..
ఆమదాలవలస, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): కొత్తవలస గ్రామంలో జరిగిన కొట్లాటలో గాయపడి శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ అరసవిల్లి హరమ్మ (60) గురువారం మృతి చెందింది. గ్రామంలో ఇరువర్గాల మధ్య బుధవారం ఉదయం కొట్లాట జరగ్గా తీవ్రంగా గాయపడిన హరమ్మను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందిందని పోలీ సులు తెలిపారు. మృతదేహానికి శవ పంచనామా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎస్.బాలరాజు తెలిపారు.