సరదాగా గడిపేందుకు వెళ్లి..
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:30 AM
ఆ ముగ్గురు మంచి స్నేహితులు. ముగ్గురూ డిప్లొమ చదువుతున్నారు.
జశ్వంత్
రాజేష్
- సముద్రంలో ముగ్గురు యువకుల గల్లంతు
- బావనపాడు తీరంలో ఘటన
- మూడు కుటుంబాల్లో విషాదం
వజ్రపుకొత్తూరు/టెక్కలి, ఆగస్టు 5 (ఆం ధ్రజ్యోతి): ఆ ముగ్గురు మంచి స్నేహితులు. ముగ్గురూ డిప్లొమ చదువుతున్నారు. సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లారు. కొద్దిసేపు తరువాత స్నానం కోసం సముద్రంలోకి దిగారు. అలల తాకిడికి వారు గల్లంతయ్యారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం బావనపాడు తీరంలో చోటు చేసుకుంది. వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి పంచాయతీ మడేవానిపేటకు చెందిన దున్న దుర్యోధన (18), పూడిజగ న్నాథపురం గ్రామానికి చెందిన తిమ్మల జశ్వంత్ (18), పలాస మండల టెక్కలిప ట్నంకు చెందిన రాయల రాజేష్(19) విజయనగరం జిల్లా గజపతినగరంలోని ఓ కళాశాలలో డిప్లొమ చదువుతున్నారు. ఈ ముగ్గురూ స్నేహితులు. మంగళవారం సాయంత్రం బావనపాడు తీరానికి వెళ్లారు. అక్కడ కొంత సమయం ఆనందంగా గడి పిన తరువాత సముద్ర స్నానానికి దిగారు. అలల ఉధృతికి ముగ్గురూ కొట్టుకుపో యారు. అటుగా వస్తున్న మత్స్యకారులు యువకుల గల్లంతును గుర్తించి స్థానికులకు, మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. మెరైన్ సీఐ డి.రాము నేతృత్వంలో మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. వీరివి నిరుపేద కుటుంబాలు. మడేవానిపేటకు చెందిన దున్న మాధవరావు సీతమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దుర్యోధన కాగా, రెండో కుమారుడు స్థానిక హైస్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో దుర్యోధన గల్లంతు వార్తతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పూడిజగన్నాథపురం గ్రామానికి చెందిన తిమ్మల వల్లభవరావు, సుధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు జశ్వంత్ ఉన్నాడు. జశ్వంత్ సముద్రంలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టెక్కలిపట్నం చెందిన రాయల రాజేష్‌ది కూడా పేద కుటుంబమే. రాజేష్‌ను తల్లి జ్యోతి అల్లారుముద్దుగా పెంచింది. కుమారుడు సముద్రంలో గల్లంతయ్యాడని తెలిసి విలపిస్తుంది.