Share News

ఈత కొట్టేందుకు వెళ్లి..

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:50 PM

సర దాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో వెళ్లిన ఓ విద్యార్థి హడ్డిబంద చెరువులో పడి మృతి చెందిన ఘటన రుషకుద్ద గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఈత కొట్టేందుకు వెళ్లి..
హర్ష (ఫైల్‌)

  • చెరువులో మునిగి విద్యార్థి మృతి

  • రుషికుద్ద గ్రామంలో విషాదం

సోంపేట రూరల్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): సర దాగా ఈత కొట్టేందుకు స్నేహితులతో వెళ్లిన ఓ విద్యార్థి హడ్డిబంద చెరువులో పడి మృతి చెందిన ఘటన రుషకుద్ద గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బొడ్డు ధర్మరాజు, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. తొలిసంతానం అయిన హర్ష (16) సోంపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. శనివారం సెలవు కావడంతో ఇద్దరు స్నేహితులతో కలిసి చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లాడు. హర్షతో వెళ్లిన ఇద్దరికి ఈత రావడం వల్ల ఒడ్డుకు చేరుకున్నారు. హర్షకు ఈత రాకపోవడంతో జీలుగ ముక్క సాయంతో కొద్దిసేపు ఈతకొట్టగా అది విరిగిపోవ డంతో చెరువులో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సోంపేట అగ్ని మాపక అధికారి సూర్యారావు చెరువు వద్దకు చేరుకొని సిబ్బందితో కలిసి గాలిం చగా.. లోతు ఎక్కువ ఉండడంతో ఫలితం లేకపోతుంది. స్థానిక మత్స్యకారుల సాయంతో చెరువులో తెప్పలతో గాలించగా హర్ష మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మృతదేహానికి సోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వ హించి కుటుంబం సభ్యులకు అప్పగించారు. హర్ష తండ్రి కర్రల మిల్లులో రోజు కూలీగా పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. కుమారుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హర్ష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:50 PM