మా డబ్బులు ఇవ్వండి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:12 AM
Customers protest at the post office ఇచ్ఛాపురం పోస్టాఫీసులో దాచుకున్న తమ డబ్బులను తక్షణమే చెల్లించాలని ఖాతాదారులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఇచ్ఛాపురం పోస్టాఫీసు వద్ద అధికారులను కార్యాలయం లోపలకు వెళ్లకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. ‘
పోస్టాఫీసు వద్ద ఖాతాదారుల నిరసన
ఇచ్ఛాపురం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం పోస్టాఫీసులో దాచుకున్న తమ డబ్బులను తక్షణమే చెల్లించాలని ఖాతాదారులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఇచ్ఛాపురం పోస్టాఫీసు వద్ద అధికారులను కార్యాలయం లోపలకు వెళ్లకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. ‘పోస్టాఫీసులో 33 మంది ఖాతాదారులకు సంబంధించిన నగదు సుమారు రూ.2.80 కోట్లు పక్కదారి పట్టింది. పిల్లల భవిష్యత్ అవసరాల దృష్ట్యా మేము దాచుకున్న డబ్బును.. ఇవ్వడానికి నెలల తరబడి అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం తగదు. మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే. లేదంటే ఎప్పుడు ఇస్తారనే దానిపై స్పష్టమైన హామీ ఇవ్వాల’ని ఖాతాదారులు పేర్కొన్నారు. దీనిపై శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు స్పందిస్తూ.. నెలాఖరులోగా ఖాతాదారులందరికీ డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 33 మంది ఖాతాదారులకు డబ్బులు చెల్లించాల్సి ఉందని, అందులో కొంతమంది ఖాతాలు పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ పూర్తియిన వెంటనే డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో చాట్ల లోహిదాస్‌రెడ్డి, బాలరాజు, సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.