రెండు రోజులు అవకాశం ఇవ్వండి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:24 AM
కోర్టు వ్యవ హారాలు ఉన్నందున తనకు రెండు రోజులు అవకాశం ఇవ్వాలని, ఈ నెల 13న విచారణకు హాజరవుతామని మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ పోలీసులకు లేఖ అందించారు.
పోలీసులకు మాజీ మంత్రి సీదిరి అభ్యర్థన
పలాస, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కోర్టు వ్యవ హారాలు ఉన్నందున తనకు రెండు రోజులు అవకాశం ఇవ్వాలని, ఈ నెల 13న విచారణకు హాజరవుతామని మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ పోలీసులకు లేఖ అందించారు. ఆదివారం అ ప్పలరాజుకు ఎస్‌ఐ నర్సింహమూర్తి 41 నోటీసు ఇస్తూ సోమవారం ఓ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలని కోరిన విషయం విదితమే. అయితే విచారణ ను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేయాలని, కోర్టు వ్య హారం ఉన్నందున హాజరుకాలేకపోతున్నామని స్పష్టం చేశారు. దీంతో ఆయన గురువారం పోలీస్టేషన్‌కు హాజ రవుతారు. అయితే అప్పలరాజు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కాశీబుగ్గ సిఐ పి.సూర్యనారా యణ తెలిపారు. కోర్టు వ్యవహారం ఉందని తెలిపారే తప్పా ఏ కోర్టు, వ్యవహారం ఏమిటనేది పేర్కొనకపోవ డంతో తిరిగి నోటీసు తిప్పి మరొకటి ఇవ్వాలని కోరా మన్నారు. గత నెలలో నకిలీ మద్యంపై వైసీపీ నేతలు ఆందోళన సమయంలో అనుమతులు లేకుండా ర్యాలీ, సమావేశం పెట్టడంపై సమాధానం ఇవ్వాలని ఆయన కు నోటీసు పంపించామన్నారు.