Share News

బాలికలు అన్ని రంగాల్లోనూ రాణించాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:58 PM

బాలికలు బాలురుతో సమానంగా అన్ని రంగాల్లోను రాణించాలని శ్రీముఖలింగం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంరాఘవులు తెలిపారు. శనివారం శ్రీముఖలింగం అంగనవాడీ కేంద్రంలో అంతర్జాతీయ బాలికలు దినోత్సవం పురస్కరించుకొని కిశోర బాలికలకు వ్యాసరచన, ఆటలు పోటీలు నిర్వహించి విజేత బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు చంద్రకళ, దేవి, మాలతి, భవాని పాల్గొన్నారు.

బాలికలు అన్ని రంగాల్లోనూ రాణించాలి
జలుమూరు: విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న హెచ్‌ఎం రాఘవులు :

జలుమూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): బాలికలు బాలురుతో సమానంగా అన్ని రంగాల్లోను రాణించాలని శ్రీముఖలింగం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంరాఘవులు తెలిపారు. శనివారం శ్రీముఖలింగం అంగనవాడీ కేంద్రంలో అంతర్జాతీయ బాలికలు దినోత్సవం పురస్కరించుకొని కిశోర బాలికలకు వ్యాసరచన, ఆటలు పోటీలు నిర్వహించి విజేత బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు చంద్రకళ, దేవి, మాలతి, భవాని పాల్గొన్నారు.

ఫపలాస, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి):స్థానిక రామకృష్ణాపురం సత్యసాయి విద్యా విహార్‌లో అంతర్జాతీయ గర్ల్‌చైల్డ్‌ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు గర్ల్‌చైల్డ్‌ డేచిహ్నం మానవహారంగా ఏర్పాటుచేసి ఆకట్టుకున్నారు.ఈసందర్భంగా విద్యార్థుల కు సంస్థ చైర్మన్‌ మల్లా రామేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ ప్రీతిచౌదరి అభినందించారు.

ఫ ఎల్‌.ఎన్‌.పేట, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి):లక్ష్మీనర్సుపేటలో బాలల హక్కుల పరిరక్షణవేదిక జిల్లా కార్యదర్శి మన్మఽథకుమార్‌మిశ్రో అధ్యక్షతన అంతర్జాతీయ బా లికల దినోత్సవం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభా ష్‌చంద్రపండా, గౌతమి, ప్రియాంక పాల్గొన్నారు.

ఫపోలాకి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి):గంగివలస కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పోలాకి పీహెచ్‌సీ విస్తరణాధికారి నల్లి రవికుమార్‌ ఆధ్వర్యంలో బాలికలకు జాతీయ బాలికా దినోత్సవంపై అవగాహన కల్పించారు. బాలికలు గర్స్‌ చైల్డ్‌ అన్న అక్షరాల మాదిరిగా ప్రదర్శన ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఇన్‌చార్జ్జి జ్యోతి, పీఈటీ ప్రియాంక, శేఖర్‌బాబు, ఇందిర, బరాటం లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:58 PM