Share News

ఈవ్‌టీజింగ్‌కు గురవుతున్న బాలికలు

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:13 AM

స్థానిక జిల్లాపరిషత్‌ బాలికల హై స్కూల్‌ ప్లస్‌కు చెందిన విద్యార్థు లు తరచూ ఈవ్‌టీజింగ్‌కు గురవుతున్నారని ఉపాధ్యాయులు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు శుక్రవారం ఫిర్యాదు చే శారు.

ఈవ్‌టీజింగ్‌కు గురవుతున్న బాలికలు
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రికి ఫిర్యాదుచేసిన ఉపాధ్యాయులు

టెక్కలి, డిసెంబరు 5(ఆంధ్ర జ్యోతి): స్థానిక జిల్లాపరిషత్‌ బాలికల హై స్కూల్‌ ప్లస్‌కు చెందిన విద్యార్థు లు తరచూ ఈవ్‌టీజింగ్‌కు గురవుతున్నారని ఉపాధ్యాయులు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు శుక్రవారం ఫిర్యాదు చే శారు. ఈ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు సుమారు 860 మం దికి పైగా విద్యార్థులు ఉన్నారని, వారు ప్రతిరోజు స్కూల్‌కు వచ్చి, వెళ్లే సమ యాల్లో బాలికలు ఈవ్‌టీజింగ్‌కు గురవుతున్నారని ఆ పాఠశాల ఉపాధ్యాయు లు మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్‌న పిలిచి ఈ పరిసరాల్లో ఏమి జరుగు తుందో గుర్తించాలని, మఫ్టీలో విధులు నిర్వహించేలా చూడాలని ఆదేశించారు.

పథకాలు అందడం లేదు..

మండా పొలం కాలనీకి చెందిన నౌగాపు అమ్మోజీ అన్నదాత సుఖీభవ డబ్బులు జమకాలేదని, అలాగే కొర్లాపు మోహనరావు తమ పిల్లలు ఇదే హై స్కూల్‌లో చదువుతున్నా తల్లికి వందనం రావడం లేదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తమకు ఇళ్లు గడవడమే కష్టంగా ఉం దని, తమకు ప్రభుత్వ పథకాలు ఇచ్చి ఆదుకోవాలని జడ్పీ బాలికల హైస్కూల్‌ ప్లస్‌ వద్ద కలెక్టర్‌ను శుక్రవారం వేడుకున్నారు. ఆరీ ్డవో ఎం.క్రిష్ణమూర్తికి వీటిని పరిశీలించాలని సూచించారు.

హైస్కూల్‌ మైదానం పరిశీలన

స్థానిక జిల్లాపరిషత్‌ బాలికల హైస్కూల్‌ ప్లస్‌కు అవసరమైన మైదానం కోసం శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఉన్నతపాఠశాలకు చెందిన శిథిలావస్థ లో ఉన్న తరగతి గదులు, ఖాళీ ప్రాంతాన్ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఆర్డీవో తదితరులు సందర్శించారు. ఈ ప్రాంతంలో 380 మీటర్ల విస్తీర్ణం ఉంద ని, జంగిల్‌ క్లియరెన్స్‌తోపాటు శిథిల భవనాలు తొలగించడానికి, క్రీడా వసతులు నిర్మాణానికి సుమారు రూ.33లక్షలు అవసరమవుతుందన్నారు. ఇందుకు సం బంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, పీఆర్‌ డీఈఈ సుధాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ డీఈఈ రవికాంత్‌, పలు శాఖల అదికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:13 AM