Share News

‘యోగాంధ్ర’కు సమాయత్తంకండి

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:32 PM

విశాఖపట్నంలో ఈనెల 21న నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రజలు సమాయత్తం కావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు.

‘యోగాంధ్ర’కు సమాయత్తంకండి
నరసన్నపేట: మాట్లాడుతున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈనెల 21న నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రజలు సమాయత్తం కావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో అధికారులు, నాయకులతో యోగాంధ్రపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి యోగాపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి విశాఖకు తీసుకురావాలని సూచిం చారు. టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పీఎం మోదీ, సీఎం చంద్రబాబునాయుడు పాల్గొనే యో గాంధ్ర కార్యక్రమం వరల్డ్‌ బుక్‌లో స్థానం సంపాదించనుందన్నారు. కార్యక్రమంలో యోగాంధ్ర మొబలైజేషన్‌ అధికారి, డీఎఫ్‌వో వేంకటేశ్వరరావు, నియోజవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండి

పాతపట్నం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): విశాఖ తీరాన ఈనెల 21న జరగనున్న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో కలిసి యోగాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఈ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్ర మానికి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో యోగాభ్యాసకులు పాల్గొనాలని కోరారు.

Updated Date - Jun 18 , 2025 | 11:32 PM