స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వండి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:52 PM
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇప్పటి నుం చే సన్నద్ధం కావాలని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి పిలుపునిచ్చారు.
పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి
పలాస, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఇప్పటి నుం చే సన్నద్ధం కావాలని పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయం లో నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అన్నీ పం చాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మునిసిపాలిటీలోని వార్డులు గెలుపొందేందుకు ఇప్పటి నుంచే అవసరమైన ప్రణాళికలు చేపట్టాల న్నారు. ప్రభుత్వం అందిస్తున్న సూపర్‌సిక్స్ పథకాలపై ప్రజలకు అవగా హన కల్పించాలన్నారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని, ఉచిత బస్సు వల్ల మహిళలంతా సంతోషంగా ఉన్నారన్నారు. వైసీపీ చేయలేనిది కూటమి ప్రభుత్వం చేసి చూపించిందని వివరించాలన్నారు. కూట మి నాయకులతో సర్దుబాటు చేసుకొని గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాల ని, ఎన్నికలే ప్రధాన అజెండాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరావు యాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాస్, బడ్డ నాగరాజు, ఎం.నరేంద్ర, టంకాల రవిశంకర్‌గుప్తా, సూరాడ మోహనరావు, గురిటి సూర్య నారాయణ, వంకల కూర్మారావు, కిక్కర ఢిల్లీరావు పాల్గొన్నారు.