Share News

ఘనంగా గౌతు లచ్చన్న జయంతి

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:34 PM

గౌతు లచ్చన్న జయంతి పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ ఆధ్వర్యంలో లచ్చన్న ఘాట్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఘనంగా గౌతు లచ్చన్న జయంతి
సోంపేట: లచ్చన్న విగ్రహానికి నివాళులర్పిస్తున్న విప్‌ అశోక్‌

సోంపేట, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): గౌతు లచ్చన్న జయంతి పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ ఆధ్వర్యంలో లచ్చన్న ఘాట్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గౌతు శివాజీ దంపతులు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ అప్పలస్వామి, నాయకులు సూరాడ చంద్ర మోహన్‌, మద్దిల నాగేశ్వరరావు, చిత్రాడ శేఖర్‌, బీన ఈశ్వరరావు, బెందాళం బాబూరావు, గోవింద్‌రెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీశయన చైతన్య దీపిక ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్యులు ఎస్‌.రాజేంద్రప్రసాద్‌, లక్ష్మీనారా యణ, చైతన్య దీపిక అధ్యక్షుడు దేవాడ మోహనరావు తదితరులు ఉన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో..

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 16 (ఆంధ్ర జ్యోతి): స్వాతంత్య్ర సమరయోథుడు, సర్దార్‌ గౌతు లచ్చన్న జయంతి శనివా రం జిల్లా పోలీసు కార్యాలయం ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ పి.శ్రీనివాసరావు పూలమాలల తో నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఏఎస్పీ మాట్లాడుతూ.. లచ్చన్న రైతుల కోసం అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీ శేషాద్రి, సీఐ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు నరసింగరావు, శంకర్‌ ప్రసాద్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీ మందిరంలో..

శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): నగరంలోని గాంధీ మందిరం లోని సంఘ సంస్కర్తల స్మృతివనంలో శనివారం ఘనంగా గౌతు లచ్చన్న జయంతి నిర్వహించారు. రాజాం మునిసిపల్‌ అధికారి జి.ప్రసాదరావు, ప్రొఫెసర్‌ విష్ణుమూర్తి, జామి భీమశంకర్‌, కొంక్యాన వేణుగోపాల్‌, లచ్చన్న విగ్రహదాత వంగా మహేష్‌దేవ్‌ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు నక్క శంకరరావు, జి.నాగేశ్వరరావు, పెంకి చైతన్యకుమార్‌, ఎంవీఎస్‌ శాస్త్రి, సువ్వారి రాజారావు తదితరులు పాల్గొన్నారు.

పలాసలో..

పలాస, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): సామాన్య కుటుంబంలో పుట్టి స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్‌వారిని ఎదురొడ్డిన గొప్పవ్యక్తి సర్దార్‌ గౌతు లచ్చన్న అని పలువురు వక్తలు కొనియాడారు. గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా కేటీ రోడ్డు నెలకొల్పిన గౌతు లచ్చన్న విగ్రహానికి స్థానిక టీడీపీ నాయకులు పూలమా లలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టగా, కాశీబుగ్గ సీతారామాలయంలో బీదలకు అన్నదానం చేశారు. కార్య క్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రామా రావు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గాలి కృష్ణారావు, గు రిటి సూర్యనారాయణ, సప్ప నవీన్‌, టంకాల రవిశంకర్‌ గుప్తా, శాసనపురి ముర ళీకృష్ణ, ఎం.నరేంద్ర, అంబటి కృష్ణమూర్తి, దడియాల నర్సింహులు పాల్గొన్నారు.

బడుగువర్గాల ఆశాజ్యోతి లచ్చన్న

పలాస రూరల్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): బడుగువర్గాల ఆశాజ్యోతి సర్దార్‌ గౌతు లచ్చన్న అని, ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటఅప్పారావు అన్నారు. కిష్టుపురం గ్రామంలో గౌతు లచ్చన్న జయం తి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బూర్లె కృష్ణంరాజు, తమ్మినాన గంగారామ్‌, వ డ్డి యాదగిరి, బి.విజయ్‌కుమార్‌, సుదర్శనరావు, ఢిల్లీరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 11:34 PM