గ్యాస్ లీకేజీ.. తప్పిన ముప్పు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:57 PM
స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని మానెం పాపారావు స్వీట్ దుకాణంలో బుధవారం ఉదయం గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.
నరసన్నపేట, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలోని మానెం పాపారావు స్వీట్ దుకాణంలో బుధవారం ఉదయం గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఇంట్లో ఉదయం స్వీట్ తయారు చేసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. గది మొత్తం మంటలు వ్యాపించి బయటకు పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అఽధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గ్యాస్ స్టవ్ వెలిగించిన సమయంలో పాపారావు చాకచాక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లీకైన గ్యాస్ వంట గది నిండా విస్తరించడంతో ఈప్రమాదం జరిగిందని అగ్ని మాపకశాఖ అధికారులు నిర్థారించారు. ప్రమాదంలో ఎవ్వరికి ఏమి జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50వేల ఆస్తి నష్టం ఉండొచ్చని అగ్ని మాపకశాఖ అధికారి వరహాలు తెలిపారు.