Share News

టిఫిన్‌ చేస్తుండగా గ్యాస్‌ లీక్‌

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:04 AM

పట్టణంలోని పదో వార్డు వాంబే కాలనీలో ఓ ఇంటిలో గ్యాస్‌ లీకై ఇద్దరికి గాయాలయ్యాయి.

టిఫిన్‌ చేస్తుండగా గ్యాస్‌ లీక్‌
కాలి బూడిదైన సామగ్రి

ఆమదాలవలస, జూలై 11(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పదో వార్డు వాంబే కాలనీలో ఓ ఇంటిలో గ్యాస్‌ లీకై ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కాలనీకి చెందిన గుంటుకు సరస్వతి టిఫిన్‌ వ్యాపారం చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం టిఫిన్‌ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆమె గాయపడింది. విషయం తె లుసుకున్న ఎదురింట్లో నివసిస్తున్న కోలా మాధవరావు ఘటనా స్థలానికి వెళ్లి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించగా అతనికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.70 వేలు నష్టం ఉంటుందని బాధితురాలు సరస్వతి వా పోతుంది. ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్‌ సిబ్బంది చేరుకుని ప్రమాదం జరిగిన తీరును బాధితురాలిని అడిగి తెలుసుకు న్నారు. స్థానిక టీడీపీ నాయకుడు నాగళ్ల మురళీధర్‌యాదవ్‌ బాధితురాలిని పరామ ర్శించారు. అధికారుల దృష్టికి తీసకువెళ్లి న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Jul 12 , 2025 | 12:04 AM