Share News

దేశం గర్వించదగ్గ సాహితీవేత్త ‘గరిమెళ్ల’

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:03 AM

‘మాకొద్దీ తెల్లదొరమంటూ ఎలుగెత్తి చాటి దేశ స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన స్వాతంత్య్ర సమర యోధుడు గరిమెళ్ల సత్యనారాయణ దేశం గర్వించ దగ్గ సాహితీవేత్త అని తెలుగు రచయితల వేదిక అధ్యక్షుడు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు అన్నారు.

దేశం గర్వించదగ్గ సాహితీవేత్త ‘గరిమెళ్ల’
గరిమెళ్ల విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న తెరవే ప్రతినిధులు

శ్రీకాకుళం కల్చరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ‘మాకొద్దీ తెల్లదొరమంటూ ఎలుగెత్తి చాటి దేశ స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన స్వాతంత్య్ర సమర యోధుడు గరిమెళ్ల సత్యనారాయణ దేశం గర్వించ దగ్గ సాహితీవేత్త అని తెలుగు రచయితల వేదిక అధ్యక్షుడు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు అన్నారు. గరి మెళ్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా సోమ వారం స్థానిక న్యూ బ్రిడ్జి రోడ్డులోని ఆయన విగ్రహా నికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో సంస్థ ప్రతినిధులు రఘుపాత్రుని వెంకట రమణమూర్తి, వావిలపల్లి రాజారావు, డా.బి.కోమల రావు, పూడి జనార్దనరావు పాల్గొన్నారు.

బీఆర్‌ఏయూలో..

ఎచ్చెర్ల, జూలై 14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ జయంతిని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. గరిమెళ్ల చిత్రఫటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.అనూ రాధ, వర్సిటీ అకడమిక్‌ విభాగం డీన్‌ డాక్టర్‌ కె.స్వప్నవాహిని, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం(శ్రీకాకుళం) ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:03 AM