శివారు ప్రాంతాల్లో చెత్త డంప్
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:13 AM
మండలంలోని కేదారిపురం పంచాయతీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గల శివారుల్లో రోడ్లకు ఇరువైపులా చెత్తను డంప్ చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెత్త కుళ్లుతుండ డంతో దుర్వాసన వెలువడుతోందని వాహనచోదకులు వాపోతున్నారు.
పలాసరూరల్, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): మండలంలోని కేదారిపురం పంచాయతీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గల శివారుల్లో రోడ్లకు ఇరువైపులా చెత్తను డంప్ చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెత్త కుళ్లుతుండ డంతో దుర్వాసన వెలువడుతోందని వాహనచోదకులు వాపోతున్నారు. పలు పంచాయతీల్లో డంపింగ్‌యార్డులు, చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. దీంతో సేకరిస్తున్న చెత్తను పంచాయతీ సిబ్బంది శివారు ప్రాంతాల్లో గల రోడ్ల పక్కన వేయాల్సి వస్తోంది. కేదారిపురం తదితర పంచాయతీల్లో తడిచెత్త, పొడిచెత్త వేసేందుకు స్థలాలు కేటాయించేలేదు. ఇప్పటికైనా పంచాయతీ పరిధిలో సేకరించే చెత్త వేయడానికి ప్రత్యేక స్థలం కేటాయించి, రోడ్ల పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.