అనాథ మృతదేహానికి అంత్యక్రియలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:01 AM
అనాఽథ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించి మాన వత్వం చాటు కున్నారు కంచిలి ఏఎస్‌ఐ వెలుకల రామారావు..
మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ రామారావు
20 ఏళ్లుగా 64 శవాలకు కర్మకాండలు
ఇచ్ఛాపురం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అనాఽథ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించి మాన వత్వం చాటు కున్నారు కంచిలి ఏఎస్‌ఐ వెలుకల రామారావు.. సుమారు 65 ఏళ్ల వయసున్న డబ్బూరి నారాయణ భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు. రాత్రిపూట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తుండే వాడు. నాలుగు రోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గుర య్యాడు. స్థానికులు గుర్తించి ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెం దాడు. ఈ విషయాన్ని ఇచ్ఛాపురం స్టేషన్‌లో అసిస్టెంట్ రైటర్ రంజిత్.. ఏఎస్‌ఐ రామారావుకు తెలిపారు. వెంటనే ఆయన బుధవారం ఆసుపత్రికి చేరుకుని శవాన్ని రథంపై బాహుదా నదికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తాను కాని స్టేబుల్‌గా ఉన్న ప్పటి నుంచి అనాథలకు అంత్యక్రియలు నిర్వహించడం అలవాటు చేసుకున్నానని, ఇప్పటి వరకు 20 ఏళ్లుగా 64 మంది అనాథలకు అంతిమ సంస్కారాలు చేశాన న్నారు. మృతుడి కొడుకు మద్యానికి బానిసై కొన్నేళ్ల కిందటే మృతి చెందాడని, కుమార్తె వివాహమై కోటబొమ్మాళిలో ఉంటుందని.. ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతుడు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పట్టణ వాసులు తెలిపారన్నారు. ఈ విషయమై అతని కుమార్తె రఘుపాత్రుని గీతకు ఫోన్ చేశామని, అయితే ఆమెది నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు కూడా పంపి ఇచ్ఛాపురం రప్పించినట్లు రామారావు తెలిపారు. అనాథలకు సేవ చేయడంలో తృప్తి ఉంటుందన్నారు.