భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:08 AM
స్థానిక ఆరోగ్యకేంద్ర ప్రాంగణంలో పాలకకమిటీ సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్యెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు.
పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు
పోలాకి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆరోగ్యకేంద్ర ప్రాంగణంలో పాలకకమిటీ సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్యెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన పోలాకి పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. శిశు, మాతా మరణాలు లేకుండా చూడాలన్నారు. ఆరోగ్యకేంద్రంలో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యాధికారి బి.శ్రీనాఽథ్ అఽధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విస్తరణాధికారి నల్లి రవికుమార్, సర్పంచ్ మజ్జి రమణమ్మ, కూటమి నాయకులు ఎంవీ నాయుడు, బైరి భాస్కరరావు, గౌరునాయుడు, రాంబాబు, కిల్లి వేణుగోపాలరావు, వైద్యాధికారులు సుమప్రియ, బి.రజనీకాంత్, ఎంపీడీవో బలగ ప్రకాష్, తహసీల్దార్ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.