cashew farmers development: జీడి రైతుల ఆర్థికాభివృద్ధికి పూర్తి సహకారం
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:19 PM
Cold storage units at 75 percent subsidy జీడిరైతుల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భరోసా ఇచ్చారు. పలాస ప్రాంత జీడిపప్పు.. కేంద్ర ప్రభుత్వ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం క్రింద ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో రైతులు, కొనుగోలుదారులు, ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు.
75శాతం సబ్సిడీపై కోల్డ్‌స్టోరేజీ యూనిట్లు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): జీడిరైతుల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భరోసా ఇచ్చారు. పలాస ప్రాంత జీడిపప్పు.. కేంద్ర ప్రభుత్వ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం క్రింద ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో రైతులు, కొనుగోలుదారులు, ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘జిల్లాలో జీడి రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. సులభ రుణ సదుపాయాలు కల్పించాలి. డీఆర్డీఏ ద్వారా సబ్సిడీ, ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రాసిసెంగ్ యూనిట్లకు విద్యుత్ శాఖతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. ముఖ్యంగా 20కిలోవాట్ల లోడ్ కంటే తక్కువ ఉన్న యూనిట్లకు ట్రాన్స్‌ఫార్మర్ అవసరం లేకుండా సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. జీడిపప్పు బైప్రోడక్ట్స్‌ను ఉపయోగించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చూడాలి. ప్రాసెసింగ్ యూనిట్లు బలోపేతం కావాలి. దళారీ వ్యవస్థ లేకుండా చూడాల’ని ఆదేశించారు. విలువ ఆధారిత ఉత్పత్తులు పెరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులు ఎఫ్‌పీవోగా ఏర్పడి ముందుకు వస్తే 75శాతం సబ్సిడీపై కోల్డ్‌స్టోరేజీ యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో ఉద్యానశాఖ అధికారి ఆర్‌వివి.ప్రసాదరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, పరిశ్రమల జీఎం శ్రీధర్, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావు, ఎల్‌డీఎం శ్రీనివాసరావు, కార్మికశాఖ ఉప కమిషనర్ కె.దినేష్‌కుమార్, ఏపీఈపీడీసీఎల్, మార్కెటింగ్, ఇతర శాఖల అధికారులు, జీడిరైతులు, బయ్యర్లు, ప్రాసెసింగ్ యూనిట్ల సభ్యులు పాల్గొన్నారు.