దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:37 PM
దేశవ్యాప్తంగా ఈ నెల 9న నిర్వ హంచనున్న సమ్మెకు వామపక్షాలు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఐఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి తామాడ సన్యాసిరావు, కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాస్ తెలిపారు.
వామపక్ష నేతలు
అరసవల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఈ నెల 9న నిర్వ హంచనున్న సమ్మెకు వామపక్షాలు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఐఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి తామాడ సన్యాసిరావు, కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు స్థానిక క్రాంతి భవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. దీనివల్ల రోజుకు 8 గంటలకు గాను 10 గంటలకు మార్పు చేశారన్నారు. కంపెనీల యాజమా న్యాలకు స్వేచ్ఛనిస్తూ, కార్మికులను బానిసలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ పాల్గొన్నారు.
ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్ల సంఘం..
అరసవల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఈ నెల 9న నిర్వహించనున్న అఖిల భారత సమ్మెలో పెన్షనర్లు పాల్గొంటారని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దొంతం పార్వతీశం, మణి కొండ ఆదినారాయణమూర్తి తెలిపారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ లోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం సమావేశం నిర్వహిం చారు. సంఘ ప్రతినిధులు పి.సుధాకరరావు, బొడ్డేపల్లి జనార్దనరావు, ప్రగడ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సోంపేట, కంచిలి, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లో సీఐటీయూ, వామపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆయా పార్టీల నేతలు, కార్మికులు పాల్గొన్నారు.