Share News

ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:38 AM

రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయాధికారి పి.హరిబాబు అన్నారు.

ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం

నరసన్నపేట, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయాధికారి పి.హరిబాబు అన్నారు. బుధవారం స్థానిక సబ్‌జైలును ఆయన పరిశీలించారు. ఖైదీలతో మాట్లడి సబ్‌జైల్‌లో సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయసహాయంను వినియోగించుకోవాలన్నారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయంపై అవగాహన చేయాలని సూచించారు. కార్యక్రమంలో బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు రావాడ కొండలరావు, రోణంకి కృష్ణంనాయుడు, తూలుగు మధుసూధనరావు, జీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న న్యాయాధికారి హరిబాబు

Updated Date - Oct 23 , 2025 | 12:38 AM