Share News

గణేష్‌ మండపాలకు ఉచితంగా అనుమతి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:23 AM

సబ్‌ డివిజన్‌ పరిధిలో గణేష్‌ మండపాల ఏర్పా టుకు ఎటువంటి చలానా చెల్లించకుండా ఉచితంగా అను మతులు పొందవచ్చని టౌన్‌ డీఎస్పీ సీహెచ్‌ వివేకా నంద అన్నారు.

గణేష్‌ మండపాలకు ఉచితంగా అనుమతి
వినాయక మండపాలను పరిశీలిస్తున్న సీఐ తదితరులు (ఇన్‌సెట్‌లో) డీఎస్పీ వివేకానంద

డీఎస్పీ వివేకానంద

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సబ్‌ డివిజన్‌ పరిధిలో గణేష్‌ మండపాల ఏర్పా టుకు ఎటువంటి చలానా చెల్లించకుండా ఉచితంగా అను మతులు పొందవచ్చని టౌన్‌ డీఎస్పీ సీహెచ్‌ వివేకా నంద అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెచ్‌టిటిపిఎస్‌ః//జీఏఎన్‌ఈఎస్‌ యుటీఎస్‌ఏవి.నెట్‌ ద్వారా పోలీసుల అనుమతి పొందవచ్చన్నారు. పోలీస్‌ శాఖ జారీ చేసిన భద్రతా నిబంధనలు, జాగ్రత్తలు కమిటీ నిర్వా హకులు పాటించాలన్నారు. మండ పాల వద్ద ఇసుక, నీటిని అందు బాటులో ఉంచుకోవాలన్నారు. పోలీసులు అనుమతించిన మా ర్గాల్లోనే విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకొని వెళ్లాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమె రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్ర మే ఉపయోగించాలన్నారు. అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసు కుంటామన్నారు. నిమజ్జన కార్యక్ర మానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

మండపాలను పరిశీలించిన అధికారులు

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 25 (ఆంధ్ర జ్యోతి): శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేస్తున్న గణేష్‌ మండ పాలను సోమవారం టూటౌన్‌ సీఐ పి.ఈశ్వర రావు ఫైర్‌, విద్యుత్‌శాఖాధి కారులతో కలిసి పరిశీలించారు. భద్రతా ప్రమాణాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారా లేదాఆరా తీశారు. మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్త లను నిర్వాహ కులకు వివరిం చారు. కొన్ని మండపాలు ఇంకా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేదని, త్వరగా అనుమతులు పొందాలన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:23 AM