Share News

హత్యాయత్నం కేసులో నాలుగేళ్లు జైలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:22 PM

ఆస్తితగాదాలో బారువకు చెందిన నాయని యోగేశ్వరరావుకు సోంపేట అడిషనల్‌ సెష న్సు కోర్టు న్యాయాధికారి జె.శ్రీనివాసరావు నాలుగేళ్లు జైలుశిక్ష విధించినట్టు సీఐ మంగరాజు మంగళవారం తెలిపారు.

హత్యాయత్నం కేసులో నాలుగేళ్లు జైలు

సోంపేట/శ్రీకాకుళం లీగల్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ఆస్తితగాదాలో బారువకు చెందిన నాయని యోగేశ్వరరావుకు సోంపేట అడిషనల్‌ సెష న్సు కోర్టు న్యాయాధికారి జె.శ్రీనివాసరావు నాలుగేళ్లు జైలుశిక్ష విధించినట్టు సీఐ మంగరాజు మంగళవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. ఆస్తితగాదాలో తెప్పల కృష్ణారావుపై 2016 జూలై 26న యోగేశ్వరరావు దాడికి పాల్ప డ్డాడు. అప్పటి ఎస్‌ఐ ఈ.శ్రీనివాసరావు కేసు నమోదుచేసి విచారణ చేపట్టి, కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. వాదోపవాదాల అనం తరం న్యాయాధికారి జె.శ్రీనివాసరావు మంగళవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు నిందితుడు నాయని యోగేశ్వరరావుకు నాలుగేళ్లు కఠిన కారాగార శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించారు. జరిమానా కట్టకుంటే మరో మూడు నెలల సాధారణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

నేలబావిలో దూకి యువతి ఆత్మహత్య

మెళియాపుట్టి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని సిరియాఖండి గ్రామానికి చెందిన ఎస్‌. సునీత (19) గ్రామ సమీపంలోని నేలబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సునీత రాత్రి ఇంటి కి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. బంధువుల ఇళ్లలోనూ వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో పశువులు కాపరులు అటుగా వెళ్లటంతో దుర్గంధం రావడంతో బావిలోకి చూడగా శవం కనిపించింది. గ్రామస్థులకు సమాచారం అందిం చగా వారు వచ్చి సునీత మృతదేహంగా గుర్తించి ఆమె కుటుంబ సభ్యు లకు తెలిపారు. తండ్రి ప్రసాదరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పిన్నింటి రమేష్‌ బాబు తెలిపారు. అయితే ఆత్యహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శవపంచనామా చేసి మృతి దేహాన్ని పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతు రాలు శ్రీకాకుళంలో లాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చదువుతోంది. 40 రోజులుగా ఇంటి వద్దనే ఉంటోందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Jun 10 , 2025 | 11:22 PM