నాలుగు పూరిళ్లు దగ్ధం
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:29 AM
మందస మండలం బుడార్సింగి పం చాయతీ సవరపద్మాపురం గ్రామంలో శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమా దంలో నాలుగు పూరిళ్లు దగ్ధమై బాధితులు కట్టుబట్టలతో మిగిలారు.
సవర పద్మాపురంలో ఘటన
హరిపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): మందస మండలం బుడార్సింగి పం చాయతీ సవరపద్మాపురం గ్రామంలో శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమా దంలో నాలుగు పూరిళ్లు దగ్ధమై బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఉదయం వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఇంటిపైకప్పుకి తగలడంతో మంటలు రాజుకున్నా యి. దీంతో సర్పంచ్ సరేష్‌పాణి గ్రహితోపాటు స్థానికులు మంటలను ఆర్పేందు కు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న మందస అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సవర లాలు, సవర ఉదవ్, సవర ఢిల్లీ, సవర నోబిన్‌కు చెందిన ఇళ్లు దగ్ధమ య్యాయి. వారంతా కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కాగా ఘటనా స్థలాన్ని సం దర్శించిన ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ బాధిత కుటుంబాలకు బియ్యంతోపాటు నిత్సా వసర సరుకులు అందజేశారు. ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.