వివాహమైన నాలుగు నెలలకే..
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:53 PM
జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ ఊర్మిళ (అను) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసు కుంది.
వివాహిత ఆత్మహత్య
భర్తపై పోలీసులకు ఫిర్యాదు
సోంపేట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ ఊర్మిళ (అను) ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసు కుంది. ఎస్‌ఐ లవరాజు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అనుకి జింకిభద్ర గ్రామానికి చెందిన షన్ముఖ (సాయి)తో ఈ ఏడాది ఆగస్టులో వివాహమైంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి.. వారం రోజుల కిందట తల్లి, భర్తతో కలిసి తిరుపతి వెళ్లి శుక్ర వారమే గ్రామానికి చేరుకుంది. శనివారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడడం చర్చనీయాం శమైంది. పెళ్లయిన నాలుగు నెలలకే ఎందుకు ఆత్మహత్మ చేసుకుందన్న విషయ మై అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఆమె భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని, విచారణ చేపట్టాలని కోరారు. ఎస్‌ఐ లవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.