గంజాయితో నలుగురి అరెస్టు
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:21 AM
పట్టణంలో గంజాయి తా గుతున్న ఇద్దరు యువకులతో పాటు విక్రయిస్తు న్న మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.
నరసన్నపేట, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలో గంజాయి తా గుతున్న ఇద్దరు యువకులతో పాటు విక్రయిస్తు న్న మరో ఇద్దరిని అరెస్టు చేసినట్టు టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 12న సూరజ్‌నగర్ సమీపంలో మణి, మోహన్ అనే ఇద్దరు యువకులు గంజాయి తాగుతున్నట్టు సమాచారం రావడంతో ఎస్‌ఐ దుర్గాప్రసాద్ వారిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. నరసన్నపేట పట్టణంతోపాటు పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్న పర్లాకిమిడి చెందిన సంజుని గుర్తించారు. సత్యవరం జంక్షన్ వద్ద పోలీసులను చూసి తప్పించుకునేందుకు సంజు ప్రయత్నించగా.. పట్టుకొని బ్యాగ్ తనిఖీ చేయిగా 20 కిలోల గంజాయిని గుర్తించారు. అలాగే మడపాం టోల్ ప్లాజా వద్ద 4.5 కిలోల గంజాయిని తీసుకువెళ్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని పట్టుకున్నారు. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.