వేర్వేరు దొంగతనాల్లో నలుగురి అరెస్టు
ABN , Publish Date - May 24 , 2025 | 11:41 PM
మండ లంలోని పలు గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన మూడు దొంగతనాల కేసుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి నట్టు డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు.
ఎచ్చెర్ల, మే 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన మూడు దొంగతనాల కేసుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి నట్టు డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో శని వారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.
2021 సంవత్సరం సెప్టెంబరు 21న ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట జాతీయ రహదారి పక్కన తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగలుగొట్టి బీరువా లో ఉన్న ఒక బంగారం ముక్క, బంగారం గొలుసు, ముత్యాలహారం, శతమానం, వెండి పళ్లెం, వెండి కుందులు, పూజ గదిలోని వెండి సామా న్లు దొంగిలించారు. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు జిల్లా వెంకటేశ్వర పురం గాంధీ గిరిజన కాలనీకి చెందిన పేడల నాగరాజు, పేడల గురవ య్యను అరెస్టు చేశారు. వేలిముద్రల ద్వారా వీరిద్దర్నీ గుర్తించి ఎచ్చెర్ల మండలం జరజాం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసి వీరి నుంచి చోరీ గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 15న కింతలి రోడ్డులోని పూడివలస గ్రామానికి సమీపం లోని ధనలక్ష్మి ఎంటర్ ఫ్రైజెస్ బాణసంచా దుకాణంలోకి ప్రవేశించి టేబు ల్ డెస్క్‌లోని రూ.10 వేలు దొంగించారు. అదేవిధంగా ఈ నెల 19న ఎచ్చెర్ల మండలం ముద్దాడలోని అసిరిపోలమ్మ తల్లి గుడిలో త్రిశూలంతో కూడిన వెండి తొడుగు, వెండి కిరీటం, కత్తితో కూడి వెండి చేయి తొడుగు, డమరకంతో కూడి వెండి చేయి తొడుగు, బంగారం పుస్తెలతాడు, అమ్మ వారి బంగారు కళ్లను అపహరణ జరిగింది. ఈ ఘటనలకు సంబంధించి ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన అల్లు రవికుమార్, లావేరు మండలం బెజ్జిపురం గ్రామానికి చెందిన టొంపల కోమలరావులను పొన్నా డ బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. ఏఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సీహెచ్ వివేకానంద పర్యవేక్షణలో కీలకంగా వ్యహరించిన ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్, ఏఎస్‌ఐ కె.రమేష్ దేవ్, హెడ్‌కానిస్టేబుల్ జగదీశ్వర రావు, సిబ్బంది దివాకర్, శ్రీనివాసరావు, గణేష్‌లను ఎస్పీ అభినందించారు.
ప్రగడపుట్టుగ శివాలయంలో చోరీ
కవిటి, మే 24(ఆంధ్ర జ్యోతి): ప్రగడపుట్టుగ గ్రామం లోని రామేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. శనివారం ఆలయా నికి వచ్చిన పూజారి తలుపు లు తెరిచి ఉండడం గమనించి గ్రామస్థులకు సమాచారాన్ని ఇచ్చాడు. గ్రామస్థులంతా వచ్చి ఆలయంలో పరిశీలన చేయగా దక్షిణంలో ఉన్న తలు పులకున్న గెడను రాయితో విరగొట్టి ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఉన్నారు. ఆలయంలోని శివుడి పంచలోహ విగ్రహం, వినాయకుడి విగ్రహంతో పాటు ఇత్తడి వస్తువులు దొంగతనం జరిగాయని ఆలయ ధర్మకర్త బి.రాంప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వి.రవివర్మ తెలిపారు. ఘటనా స్థలానికి క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించామన్నారు.
తామరాపల్లిలో ద్విచక్ర వాహనాలు..
నరసన్నపేట, మే 24(ఆంధ్రజ్యోతి): తామరాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. గ్రామానికి చెందిన కోల రాజు, కోల శాంతారావులకు చెందిన బైక్‌లను ఇంటి ముందుభాగంలో ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.