Share News

వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్టు

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:25 AM

చిట్టివ లస గ్రామానికి చెందిన నవిరి పూ ర్ణ అనే వివాహిత ఆత్మహత్య కేసులో సోమవారం నలు గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తెలిపారు.

వివాహిత ఆత్మహత్య కేసులో నలుగురి అరెస్టు
విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద

ఆమదాలవలస, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): చిట్టివ లస గ్రామానికి చెందిన నవిరి పూ ర్ణ అనే వివాహిత ఆత్మహత్య కేసులో సోమవారం నలు గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చిట్టివలసకు చెంది న నవిరి సింహాచలం, పద్మ దంపతుల కుమార్తె పూర్ణను పట్టణంలోని ఐజే నా యుడు కాలనీకి చెందిన మధుసూదనరావుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం జరిగిందన్నారు. వివాహ సమయంలో అల్లుడికి కట్న కానుకులు ఇచ్చినప్పటికీ, అదనపు కట్నం కావాలని భర్త, అత్తమామలు వేధించడంతో కన్నవారింటికి చేరు కున్న పూర్ణ మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంద న్నారు. దీనికి కారణమైన భర్త మధుసూదనరావు మామ లక్ష్మణ, అత్త సరస్వతి, మరిది ఈశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. వారిని స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్‌ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బాలరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 12:25 AM