Share News

మాజీ ఎమ్మెల్యే ‘దక్కత’ సతీమణి కన్నుమూత

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:30 PM

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దివంగత దక్క త అచ్యుతరామయ్య రెడ్డి భార్య ఆదిలక్ష్మి (79) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

మాజీ ఎమ్మెల్యే ‘దక్కత’ సతీమణి కన్నుమూత
ఆదిలక్ష్మి పార్థివదేహం వద్ద సంతాపం తెలుపుతున్న ఎమ్మెల్యే అశోక్‌

ఇచ్ఛాపురం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దివంగత దక్క త అచ్యుతరామయ్య రెడ్డి భార్య ఆదిలక్ష్మి (79) అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆదిలక్ష్మి మృతి చెందిన విషయం తెలు సుకుని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సంతాపం తెలిసిన వారిలో మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి పద్మనాభం, నేతలు సహదేవ్‌రెడ్డి, డి.సూర్యనారాయణ, డి.కామేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 11:30 PM