అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:42 PM
అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘనాయకులు కోరారు.ఈ మేరకు గురువారం గొట్టిపల్లి సచివాలయం ఎదుట ఆదివాసీలు చీపుర్లుతో నిరసన తెలిపి, ధర్నా చేశారు.
కొత్తూరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి):అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘనాయకులు కోరారు.ఈ మేరకు గురువారం గొట్టిపల్లి సచివాలయం ఎదుట ఆదివాసీలు చీపుర్లుతో నిరసన తెలిపి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న మా ట్లాడుతూ జిల్లాలోని 12 మండలాల్లో లక్ష మందికిపైగా గిరిజన కుటుంబాలు పోడు వ్యవసాయం చేసి జీవిస్తున్నాయని, వీరి పండించే పంటలకు మద్దతు ధర లేక నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సం ఘ నాయకులు శిర్ల ప్రసాదరావు,గిరిజన సంఘ నాయకులు సవర మోహన్, జమ్మ య్య, సూర్యనారాయణ, బాగన్న, సవర నాగేష్, నిమ్మక రత్నాలమ్మ పాల్గొన్నారు.