కూర్మనాథుని సన్నిధిలో విదేశీ భక్తులు
ABN , Publish Date - Apr 21 , 2025 | 11:38 PM
శ్రీ కూర్మనాథుడిని సోమవారం ఉదయం రష్యా దేశానికి చెందిన ఇస్కాన్ భక్తులు దర్శించుకున్నారు.
గార, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): శ్రీ కూర్మనాథుడిని సోమవారం ఉదయం రష్యా దేశానికి చెందిన ఇస్కాన్ భక్తులు దర్శించుకున్నారు. శ్వేత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి అనంతరం స్వామివారికి పూజలు చేశారు. పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తి గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు.