Share News

క్రీడాస్ఫూర్తితో గెలుపు బాటలు వేసుకోండి

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:54 PM

విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని గెలుపునకు బాటలు వేసుకోవాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

క్రీడాస్ఫూర్తితో గెలుపు బాటలు వేసుకోండి

ఎచ్చెర్ల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని గెలుపునకు బాటలు వేసుకోవాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల (శ్రీకాకుళం) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రాంతీ యస్థాయి పాలిటెక్నిక్‌ కళాశాలల క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రావీణ్యం సాధించిన వారికి సమాజంలో సరైన గుర్తింపు ఉంటుందన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ జేడీ వి.పద్మారావు, శ్రీకాకుళం బాలురు, బాలికలు, ఆమదాలవలస, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సి పాళ్లు డాక్టర్‌ కె.నారాయణరావు, డాక్టర్‌ బి.జానకి రామయ్య, డాక్టర్‌ బీవీ ఎస్‌ఎన్‌ మూర్తి, టెక్కలి కళాశాల ఓఎస్‌డీ డి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌ (బాలికలు) శ్రీకాకుళం, ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల(బాలురు), శ్రీకాకుళం సాధించారు. వ్యక్తి గత చాంపియన్‌షిప్‌ను కె.శివరామకృష్ణ (ప్రభుత్వ పాలిటెక్నిక్‌ (బాలురు), వ్యక్తిగత చాంపియన్‌ షిప్‌ బి.సోనియా (ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌) చేజిక్కించుకున్నారు. వాలీబాల్‌ బాలి కల విభాగంలో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్‌ (శ్రీకాకుళం ప్రథమ), శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్‌ (ద్వితీయ) బహుమతు లు సాధించాయి. వాలీబాల్‌ బాలురు విభాగంలో శ్రీ వెంక టేశ్వర పాలిటెక్నిక్‌ ప్రథమ, ఆదిత్య పాలిటెక్నిక్‌ ద్వితీయ స్థానాలు పొందాయి. ఖోఖోలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ ప్రథమ, శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్‌ ద్వితీయ బహుమతులు సాఽధించాయి. కబడ్డీలో ప్రథమ స్థానాన్ని ఆదిత్య పాలిటెక్నిక్‌, ద్వితీయ స్థానాన్ని శ్రీ వెంకటేశ్వర పాలిటెక్నిక్‌ సాధించాయి.

Updated Date - Dec 24 , 2025 | 11:54 PM