పీజీటీల పదోన్నతులపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:49 PM
రాష్ట్రంలో 14 సంవత్సరాలుగా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు.
ఆమదాలవలస/ పొం దూరు, మార్చి 18(ఆంధ్ర జ్యోతి):రాష్ట్రంలో 14 సంవత్సరాలుగా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో 126 సైన్స్ కళాశాలల్లో 86 మంది ఉపాధ్యాయులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యపై 2010లో కమిటీ విచారణ కూడా చేపట్టినట్లు తెలిపారు. మళ్లీ 2023లో కూడా ఇదేసమస్యపై మరో కమిటీ రాష్ట్రంలో విచారణ పూర్తి చేసిందని చెప్పారు. అధికారులు స్పందించి ఆ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. 8, 9, 10 తరగతుల్లో బోధిస్తున్న టీజీటీ, పీజీటీ ఉపాధ్యాయులు పదోన్నతులకోసం నిరీక్షించడానికి అధికారులు నిర్లక్ష్యమేకారణమని తెలిపారు.
చంద్రబాబును కలిసిన నాయకులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలోని సీఎం క్యాంపు కార్యా లయంలో మంగళవారం పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌తోకలిసి పొందూరు మండలానికి చెందిన ఏఎంసీ చైర్మన్ అన్నెపు రాము, తెలుగుయువత జిల్లా ప్రధానకార్యదర్శి బలగ శంకరభాస్కర్ కలిశారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపఽథకాలను పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని నాయకులకు చంద్రబాబునాయుడు సూచించారు.
గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి
అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను మరింత వేగవంతం చేసి పూర్తి చేసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా 2029 నాటికి అందరికీ సొంత ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పీఎంఏవై 1.0లో ఇళ్లు, పీఎంఏవై, పీఎంజన్‌మన్ పథకంలో మంజూరై వివిధదశల్లో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన గృహాల నిర్మాణాలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఎస్సీ, బీసీలకు రూ.ఐదు వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, పీవీ జీటీలకు రూ.లక్ష ఆర్థికసాయం చేయనున్నట్టు తెలిపారు.