ఉద్యాన, వాణిజ్య పంటలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:00 AM
‘For you, farmer.’ కేవలం వరిసాగు కాకుండా ఉద్యాన, వాణిజ్య పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ‘రైతన్న మీ కోసం’ వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఎచ్చెర్ల మండలం పొన్నాడలో ఆయన పర్యటించారు. పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఎచ్చెర్ల, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కేవలం వరిసాగు కాకుండా ఉద్యాన, వాణిజ్య పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ‘రైతన్న మీ కోసం’ వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఎచ్చెర్ల మండలం పొన్నాడలో ఆయన పర్యటించారు. పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ‘రబీలో వేరుశనగ, చోడి, పొద్దుతిరుగుడు, పామాయిల్ తదితర పంటలను సాగుచేయాలి. అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు పండించాలి. జిల్లా కేంద్రానికి అతి చేరువలో ఉండడంతో ఈ ప్రాంత రైతులు పాడిపోషణతో ప్రయోజనం పొందవచ్చు. బీడు భూముల్లో పశుగ్రాసం సాగుచేయాల’ని కలెక్టర్ సూచించారు. బుధవారం సచివాలయం వద్ద గ్రామస్థాయి వ్యవసాయ ప్రణాళికను ప్రదర్శించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, పశు సంవర్థక శాఖ డీడీ డాక్టర్ కె.సూర్యనారాయణ, ఏడీఏ బి.రజని, ఎంపీడీవో ఎస్.హరిహరరావు, మండల వ్యవసాయాధికారి వి.రాజేశ్వరరావు, నారాయణపురం ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు, పంచిరెడ్డి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నేతింటి నీలమప్పడు పాల్గొన్నారు.