పెంటిభద్రలో శాశ్వత నీటి పథకంపై దృష్టి
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:57 PM
పెంటిభద్ర గిరిజనుల తాగునీటి అవసరాలు తీరుస్తామని, శాశ్వత మంచినీటి పథకంపై దృష్టి పెడతామని పలాస- కాశీబుగ్గ మునిసిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు స్పష్టంచేశారు.ఆంధ్రజ్యోతిలో పెం టిభద్రలో తాగునీటి కష్టాలు శీర్షికతో ఈనెల 14న కథనం ప్రచురితంకావడంతో స్పందించిన కమిషనర్ మంగళవారం ఆగ్రామాన్ని సందర్శించి ప్రజలు నీటికోసం పడుతున్న ఇబ్బందులు పరిశీలించారు. ఈ
పలాస,డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి):పెంటిభద్ర గిరిజనుల తాగునీటి అవసరాలు తీరుస్తామని, శాశ్వత మంచినీటి పథకంపై దృష్టి పెడతామని పలాస- కాశీబుగ్గ మునిసిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసులు స్పష్టంచేశారు.ఆంధ్రజ్యోతిలో పెం టిభద్రలో తాగునీటి కష్టాలు శీర్షికతో ఈనెల 14న కథనం ప్రచురితంకావడంతో స్పందించిన కమిషనర్ మంగళవారం ఆగ్రామాన్ని సందర్శించి ప్రజలు నీటికోసం పడుతున్న ఇబ్బందులు పరిశీలించారు. ఈసం దర్భంగా గ్రామస్థులతో మాట్లాడారు.శాశ్వత మంచినీటి పథకం కోసం చర్యలు తీసుకుంటామని,ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటినిసరఫరాచేస్తామని చెప్పారు. బోరుకు మరమ్మతులుచేసి నీరందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదే శించారు. ఆయన వెంట కౌన్సిలర్ సవర సోమేశ్వరరావు, రాంబాబు ఉన్నారు.