Share News

హైవే ప్రమాదాల నియంత్రణపై దృష్టి సారించండి

ABN , Publish Date - May 22 , 2025 | 12:03 AM

జాతీయ రహదారి మార్గంలో ప్రత్యేక కార్యచరణతో ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు.

హైవే ప్రమాదాల నియంత్రణపై దృష్టి సారించండి
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

- పకడ్బందీగా పెట్రోలింగ్‌ విధులు

- ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, మే 21(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి మార్గంలో ప్రత్యేక కార్యచరణతో ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు. హైవేపై ట్రాఫిక్‌, ప్ర మాదాలు, నేరాల నియంత్రణ, సహాయక చర్యలపై పెట్రోలింగ్‌ సిబ్బంది నిర్వహిం చాల్సిన విధులు తదితర అంశాలపై బుధ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమీ క్షలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. రహదారులపై నేరాలు, ప్రమాదాలు నివారించడం, ప్రయాణికులకు సహాయం అం దించడం పెట్రోలింగ్‌ ముఖ్యవిధి అని, ఆ దిశగా అప్రమ త్తంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలన్నారు. వాహ నాల మెంటినెన్స్‌ సక్రమంగా ఉండాలన్నారు. రోడ్డుకిరువైపు లా లారీలు, ఇతర భారీ వాహనాలు పార్కింగ్‌ లేకుండా చూడాలన్నారు. కేటాయించిన పార్కింగ్‌ ప్రదేశాల్లో వాహ నాలు పార్కింగ్‌ చేసేలా చూడాలన్నారు. సర్వీస్‌ రోడ్డు మార్గంలో వాహనాలు రాంగ్‌రూట్‌లో వచ్చే వాహనాలు నియంత్రించాలని తెలిపారు. హైవే మార్గంలో దాబా, హోటళ్లు నిర్ణీత సమయానికి మూయించాలన్నారు. వేకువ జామున సమయంలో టోల్‌ప్లాజా, చెక్‌పోస్టుల వద్ద వాహనచోదకులకు నిరంతరం ఫేస్‌వాష్‌ కార్యక్రమం జరి పించాలన్నారు. ప్రమాద హెచ్చరిక, మలుపు అతివేగంగా నియంత్రణ, సూచిక బోర్డులు, స్టాపర్స్‌, సోలార్‌ బ్లింకర్స్‌ నిర్వహణ సక్రమంగా ఉండేలా హైవే అథారిటీ సమన్వ యంతో చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది రేడియో జాకెట్లు తప్పక ధరించాలని ఆదేశించారు. రోడ్లపై ట్రాఫిక్‌ క్రమ బద్ధీకరించడం, ట్రాఫిక్‌ జామ్‌లు నివారించడం వంటి హైవే పైట్రో లింగ్‌ సిబ్బంది బాధ్యతగా నిర్వర్తిం చాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదా లు జరిగే సమయంలో వెంటనే ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించి క్షతగా త్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు 108 అంబులెన్స్‌ సహకారంతో తీసుకెళ్లా లని తెలిపారు. రోడ్డుపై ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది వెంటనే స్పందించి సాయమందించాలన్నారు. హైవే సిబ్బంది ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమీక్షలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్‌ వివేకానంద, ఎంవీ అప్పారావు, సీఐలు పైడపునాయుడు, అవతారం, విజయ్‌కుమార్‌, తిరుపతిరావు, శ్రీనివాస్‌, ఆర్‌ఐ కె.నరసింగరావు, ఎస్‌ఐలు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:03 AM